We’re here to help with your problem.
A place to be heard. Share the problems in your village, your neighbourhood or your everyday life with the Renikuntla Praveen Help Desk.
Political activist · M.A. Sociology
WE’RE HERE TO LISTEN
Tell us about your problem
WE’RE HERE TO LISTEN
Tell us about your problem
Renikuntla Praveen is a political activist from Bellampalli constituency in Telangana, with a Master of Arts in Sociology. His journey spans the Telangana statehood movement, organisational leadership, library development and support for disadvantaged communities.
His work places education, health and livelihoods at the centre of public service, with a focus on people who need support at the grassroots.
Personal archives and credited news photographs.
Reporting on the transformation of libraries across Mancherial and improved reading spaces for students.
Coverage of a book donation to the library in Bellampalli in the presence of library chairman Renikuntla Praveen.
Coverage of Praveen’s appointment to the Telangana SC & ST Commission and felicitation in Bellampalli.
For help with a complaint, contact the Bellampalli help desk.
Political activist · Bellampalli · M.A. Sociology
This biography is based on details supplied by Praveen’s team. Linked news reports independently document selected public roles and library work.
విద్యార్థి దశలో ఆర్ఎస్యూ (RSU) ఉద్యమంతో నా ప్రస్థానం ప్రారంభమైంది. 1991లో అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో పూర్తికాల కార్యకర్తగా చేరాను. ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న సింగరేణి కార్మిక సమాఖ్య (సి.కా.స.) ఆధ్వర్యంలో కోల్బెల్ట్ ప్రాంతంలో కార్మికుల సమస్యలపై పనిచేశాను.
ఈ కాలంలో కార్మికుల హక్కుల సాధన కోసం వారిని సంఘటితం చేసి, వివిధ పోరాటాల్లో భాగస్వాములను చేశాను. కార్మిక సమస్యలతోపాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూడా ఉద్యమాలు నిర్వహించాను.
2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి డీజీపీ హెచ్.జె. దొర గారి సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశాను.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షతో, 2001లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గారి నాయకత్వంలో స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీలో చేరాను. ఆయన నాయకత్వంలో సాగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగస్వామినయ్యాను. కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ, బెల్లంపల్లి నియోజకవర్గంతోపాటు జిల్లా స్థాయిలో పార్టీ విస్తరణకు, సంస్థాగత బలోపేతానికి కృషి చేశాను. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ, ప్రజలతో మమేకమై నా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాను.
2002లో కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీలో చేరి, తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లో విస్తృతంగా వ్యాప్తి చేయడానికి కృషి చేశాను. 2009లో కేసీఆర్ గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాటి నుంచి 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు అనేక ఉద్యమ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాను. ఈ క్రమంలో రైలు రోకో తదితర నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు నాపై సుమారు 18 కేసులు నమోదయ్యాయి. జైలు నిర్బంధాన్ని కూడా ఎదుర్కొన్నాను. ఈ నిర్బంధాల మధ్య సైతం తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యానికి కట్టుబడి, ఉద్యమంలో నిబద్ధతతో పనిచేశాను.
పార్టీ సంస్థాగత బలోపేతం, కార్మికుల హక్కుల సాధన లక్ష్యంగా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించాను.
పార్టీ ఆదేశాల మేరకు పలు సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు, ఎన్నికల ఇన్చార్జి బాధ్యతలను నిర్వర్తించాను.
2017లో మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ తొలి చైర్మన్గా బాధ్యతలు చేపట్టి, 2023 వరకు ఆ పదవిలో కొనసాగాను. అనంతరం, 2023 అక్టోబర్లో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించాను. ఈ పదవికి నా పదవీకాలం 2026 అక్టోబర్ వరకు ఉంది.
మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ తొలి చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం, జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చాను. విద్యార్థులు, నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అవసరమైన పుస్తకాలు, ఆధునిక వసతులు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేశాను.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత గ్రంథాలయాన్ని పునరుద్ధరించి, ఆధునిక సౌకర్యాలు, నాణ్యమైన ఫర్నిచర్, ఎయిర్ కండిషనింగ్ వసతి కల్పించాను. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థినీ విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అవసరమైన వివిధ రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచాను. బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలో అన్ని హంగులతో కూడిన పక్కా గ్రంథాలయ భవనాన్ని నిర్మించి, ఎయిర్ కండిషనింగ్ సౌకర్యం, ఆధునిక ఫర్నిచర్, పోటీ పరీక్షల పుస్తకాలను సమకూర్చాను. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోనూ ఆధునిక గ్రంథాలయ భవనంతోపాటు అవసరమైన ఫర్నిచర్, పోటీ పరీక్షల పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చాను.
మారుమూల ప్రాంతాల ప్రజలు, విద్యార్థులకు గ్రంథాలయ సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో వేమనపల్లి, కోటపల్లి, భీమారం, భీమిని, కన్నెపల్లి, నెన్నెల మండల కేంద్రాల్లో నూతన గ్రంథాలయాలను నిర్మించాను. జన్నారం, దండేపల్లి మండలాల్లో నూతన గ్రంథాలయాల నిర్మాణానికి నిధులు కేటాయించాను. అలాగే, మంచిర్యాల జిల్లా కేంద్రంలో రూ.18 కోట్ల వ్యయంతో అత్యాధునిక గ్రంథాలయ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేశాను
మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గ కేంద్రాల్లో నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణతోపాటు ఉచిత భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశాను. ఈ సదుపాయాలను వినియోగించుకున్న అభ్యర్థుల్లో సుమారు 366 మంది వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.
2023 అక్టోబర్లో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి, ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి కృషి చేశాను. ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడులు, దౌర్జన్యాలకు సంబంధించిన అట్రాసిటీ కేసుల విచారణలో జాప్యం జరగకుండా పర్యవేక్షించాను. జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాల నిర్వహణకు కృషి చేసి, సంబంధిత అధికారులతో కేసుల పురోగతిని సమీక్షించాను. బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం, సహాయ సహకారాలు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాను. ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్ నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా పర్యవేక్షించాను. ఎస్సీ, ఎస్టీ వసతిగృహాలను సందర్శించి, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి చేశాను. ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధితులకు నిబంధనల మేరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేశాను. పౌర హక్కుల దినోత్సవం వంటి కార్యక్రమాలు సమర్థంగా అమలయ్యేలా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా కృషి చేశాను. కమిషన్కు కల్పించిన అధికారాల పరిధిలో బాధ్యతలను నిర్వర్తిస్తూ, ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కుల పరిరక్షణకు, సామాజిక న్యాయానికి, సమగ్ర అభివృద్ధికి తోడ్పడ్డాను.
is proudly powered by WordPress